![]() |
![]() |

అగ్నిపరీక్షలో టాప్ 15 మధ్య హోరాహోరి పోటీ నడుస్తుంది.అగ్నిపరీక్షలో లీడర్ ఎవరు అనర్హులో తేల్చడానికి పెట్టిన బాల్ టాస్క్ తోనే అసలు రచ్చ మొదలైంది. రూల్ సింపుల్, బాల్ పట్టుకున్నోడు సేఫ్ అవుతాడు. ఇద్దరి పేర్లు చెప్పి ఎందుకు లీడర్ కి పనికిరారో చెప్పాలి. ఒకసారి కంటే ఎక్కువసార్లు బాల్ వస్తే వేరే వాళ్లకి ఇచ్చేయాలి. ఫస్ట్ మిథిలేష్ పట్టుకుని రాజకుమారి, అపూర్వ ఔట్ అన్నాడు. ఆ తర్వాత దీపక్ వచ్చి హేమంత్, గాయత్రిని లేపేశాడు. ఇందులో హైలైట్ షాలినీ, రామకృష్ణ గొడవే.
దీపక్ మళ్లీ బాల్ పట్టుకుని రామకృష్ణకి ఇస్తే, అతను రోహిత్, చరణ్ పేర్లు చెప్పాడు. నెక్స్ట్ రౌండ్ లో షాలినీ బాల్ పట్టుకుని డైరెక్ట్ గా రామకృష్ణ పేరే చెప్పేసింది. దానికి రామకృష్ణ.. నేను లీడర్ ని కదా నన్నెలా ఔట్ చేస్తావని అంటాడు. నీకు ఆటే అర్థం కాదు, అదే నీ ప్రాబ్లం, లాస్ట్ రౌండ్ లో పట్టుకున్నావ్ ఈ రౌండ్ లో కాదని షాలినీ గట్టిగా ఇచ్చేసింది. లాస్ట్ లో ప్రియాంక వచ్చి అమన్, మిథిలేష్ లను ఔట్ చేసింది, దీంతో షాలినీ, ప్రియాంక, శ్రష్టి, దీపక్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లారు. నెక్స్ట్ లీడర్ ని సెలెక్ట్ చేయడానికి గ్లాసులో నీళ్లు కాపాడుకోవాలనే టాస్క్ పెట్టారు.
దీంట్లో షాలినీ, ప్రియాంక గెలిచి ఇద్దరు లీడర్లు అయ్యారు. వెంటనే జ్యూరీ మిగిలిన వాళ్లని టీమ్స్ గా విడిపోమ్మన్నారు. షాలినీ టీంలోకి రాజకుమారి, శ్రష్టి, అపూర్వ, రోహిత్, చరణ్, అమన్ వచ్చారు. ప్రియాంక టీంలోకి హేమంత్, రామకృష్ణ, ఝాన్సీ, గాయత్రి, మిథిలేష్, దీపక్ వెళ్లారు. ఇక్కడే బిందు మాధవి ట్విస్ట్ ఇచ్చింది. అమన్ గెలిచిన స్వాప్ ది లీడర్స్ కార్డుని షాలినీకి ఇచ్చేసింది. షాలినీ వెంటనే పవర్ యూజ్ చేసి ప్రియాంకను తీసేసి ఝాన్సీని లీడర్ ని చేసేసింది.
![]() |
![]() |